NEET UG కటాఫ్ అనలైజర్ 2020 సంవత్సరానికి సంబంధించిన కౌన్సిలింగ్ విశ్లేషణ I3C.Tech వారు మీ కొరకు మీ ముందు ఉంచుతున్నారు. ఇందులో పొందుపరిచిన సమాచారం మొత్తం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కళాశాలల యొక్క 20-21 సంవత్సరం కౌన్సిలింగ్ ఆధారంగా సేకరించబడినది. ఇండియాలోని అన్ని రకాల కౌన్సిలింగ్ ప్రక్రియ కు సంబంధించిన కట్ ఆఫ్ అనలైజర్ లింక్ ను మీ ఉపయోగం కోసం ఈ క్రింద ప్రచురించబడినది. దీనిని ఉపయోగించి మీకు అవసరమైన సమాచారం పొందవచ్చును.
మనందరికీ తెలిసిన విధముగా NEET UG విద్యార్థులు తమ మెడికల్ లేదా డెంటల్ సీట్లు ఎంపిక చేసుకునే విధానంలో పలు జాగ్రత్తలు వహించవలెను లేనిచో పొరపాటు జరుగుటకు అవకాశం ఉన్నది. I3C.Tech వారు అందించు NEET UG 2021 కటాఫ్ ఎనలైజర్ ద్వారా దేశ ,రాష్ట్ర ప్రభుత్వాల కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనుట కొరకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, నీట్ అర్హత, సాధించిన నీట్ ర్యాంక్ మరియు కుల ప్రాతిపదికన వర్తించు రిజర్వేషన్ మొదలగు సమాచారం ఇవ్వబడినది . విద్యా సంవత్సరం 21-22 లో పాల్గొనే ప్రతి డాక్టర్ విద్యార్థికి మరియు వారి తల్లిదండ్రులకు I3C.Tech వారు అందించిన ఈ సమాచారం చాలా విలువైనది ఇది మీకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంచటం మాకు సంతోషకరం .